భారత్, ఇంగ్లాండ్(IND Vs ENG) మధ్య ఇటీవల రద్దయిన అయిదో టెస్టును(Manchester Test) వచ్చే ఏడాది ఆగస్టులో నిర్వహించడానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. ఆ సమయంలో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పుడే అదనంగా ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్ అంగీకరించింది. అయిదు టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఈ నెల 10-14 తేదీల్లో జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో కరోనా కేసులు నమౌదైన క్రమంలో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడం వల్ల మ్యాచ్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఏం జరిగిందంటే?
ఐదో టెస్టుకు ముందు రోజు(సెప్టెంబరు 9) సాయంత్రం భారత బృందంలోని సహాయక సిబ్బందిలో యోగేశ్ పరామర్ అనే ఫిజియోకు కరోనా పాజిటివ్‌గా(Corona in Team India) తేలింది. అయితే, అతడితో పలువురు ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా నెగెటివ్‌గా తేలింది. అయినా టీమ్‌ఇండియా ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖరాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరు బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడం వల్ల సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. ఇక ఓవల్ వేదికగా నాలుగో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌కు పాజిటివ్‌గా తేలారు.
ఇదీ చూడండి..Jyothi Surekha Archery: రికార్డులు కొల్లగొట్టడం 'విల్లు'తో పెట్టిన విద్య!