ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి(యూనిసెఫ్) భాగమైంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, కౌమర దశలోని వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్.. ఐసీసీతో ఒప్పందం చేసుకుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగమైన యూనిసెఫ్ - UNICEF
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి(యూనిసెఫ్) భాగమైంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, కౌమార దశలోని వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC News)తో యూనిసెఫ్ ఒప్పందం కుదుర్చుకుంది.
యావత్ ప్రపంచం టీ-20 వరల్డ్‌కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. చిన్నారుల ఆరోగ్యం కోసం యూనిసెఫ్(UNICEF News) చేస్తున్న ఈ ప్రచారం ప్రపంచం నలుమూలలకు విస్తరించనుంది. 'ఆన్‌యువర్‌మైండ్' హ్యాష్‌ట్యాగ్‌తో జరిగే ఈ ప్రచారం.. వ్యక్తుల మానసిక ఆరోగ్యం కోసం తాము ఏమేర నిబద్ధతను కలిగి ఉన్నామో తెలియజేస్తుందని ఐసీసీ ప్రకటించింది. యూఏఈ, ఒమన్ వేదికగా టీ-20 ప్రపంచకప్ జరగనుండగా మెుత్తం 45 మ్యాచులను ఐసీసీ నిర్వహించనుంది.
ఇదీ చూడండి..భారత్-పాక్ మ్యాచ్.. ఆ సూపర్ యాడ్ వచ్చేసింది