కామెంటేటర్ అవతారం ఎత్తిన తర్వాత క్రికెటర్ దినేశ్ కార్తిక్(Dinesh Karthik commentary) రెట్టింపు ఉత్సాహంతో కనపడుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లను ఒక్కొక్కొరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. తొలి టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన డీకే.. అతడి జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను అభిమానులకు అందించాడు. ఇక ఇప్పుడు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో సంభాషించాడు.
లార్డ్స్ వేదికగా రెండో టెస్టు గురువారం ప్రారంభంకానుంది. దీనికి ముందు.. రోహిత్‌ను ఇంటర్వ్యూ(Rohit Sharma news) చేశాడు డీకే. ఇందుకు సంబంధించిన స్నీక్ పీక్ ఒకటి.. తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. అందులో.. రోహిత్ పెళ్లి తర్వాత మారిపోయాడన్నాడు కార్తిక్.