ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు ఆడాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించగా.. ఆటను తాత్కాలికంగా నిలిపేశారు. ఆ తర్వాత అది ఆగకపోవడం వల్ల మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
వర్షం కారణంగా భారత్-ఆస్ట్రేలియా టీ20 రద్దు - IND W vs AUS W live cricket score
భారత్, ఆస్ట్రేలియా మహిళాల తొలి టీ20 రద్దయింది. ఎడతెరపిలేని వర్షం పడటం వల్ల మ్యాచ్‌ను మధ్యలో నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 శనివారం జరగనుంది.
వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ రద్దు
భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(49 నాటౌట్) అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(17), స్మృతి మంధాన(18) ఆరంభంలో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 2 వికెట్లు తీయగా.. సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహమ్ చెరో వికెట్ పడగొట్టారు. మూడు టీ20ల సిరీస్‌లో ఇరుజట్ల మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది.
ఇదీ చూడండి..CSK Vs PBKS: పంజాబ్ ధమాకా.. చెన్నైపై అదిరిపోయే గెలుపు