ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టులో (india vs australia womens live) టీమ్ఇండియా బ్యాటర్ పూనమ్ రౌత్ చక్కని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. అంపైర్ నాటౌట్ ఇచ్చినప్పటికీ.. ఔట్ అని తెలిసి మైదానాన్ని స్వతహాగా వీడింది. పూనమ్ నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఏం జరిగింది?
పూనమ్ 36 (india vs australia womens) పరుగుల వద్ద ఉండగా.. ఎడమచేతి వాటం బౌలర్ సోనీ మోలీనెక్స్ బంతిని విసిరింది. అది కాస్తా.. పూనమ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలోకి వెళ్లింది. ఆసీస్ క్రీడాకారిణులు అప్పీల్ చేసినప్పటికీ అపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ బాల్ బ్యాట్‌కు టచ్ అయిందని తెలిసి మైదానాన్ని వీడి అందరినీ ఆశ్చర్యపరిచింది (Punam Raut sports spirit) పూనమ్. దీంతో ఆస్ట్రేలియా క్రీడాకారిణులు డీఆర్ఎస్కు వెళ్లలేదు.
ఆస్ట్రేలియా-భారత్ మధ్య డేనైట్ టెస్టు జరుగుతోంది. మొదట బరిలోకి దిగిన భారత జట్టు మెరుగైన ఆటతీరును కనబరుస్తోంది. ఈ పింక్ బాల్ టెస్టులో పూనమ్ 165 బాల్స్‌లో 36 పరుగులు చేసింది. స్మృతి మంధాన 216 బంతుల్లో 127 రన్స్ సాధించింది.
ఇదీ చదవండి:మంధాన అరుదైన రికార్డు.. తొలి భారత మహిళా క్రికెటర్‌గా!