తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDvsENG: మూడో టెస్టు హైలైట్స్ చూసేయండి! - భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్టు హైలైట్స్

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయం చవిచూసింది టీమ్ఇండియా. ఇంగ్లీష్ జట్టు బౌలర్ల సమష్టి కృషి, భారత బ్యాట్స్​మెన్ పేలవ ప్రదర్శన వెరసి ఈ మ్యాచ్​లో ఓటమిపాలైంది కోహ్లీసేన. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హైలైట్స్ మరోసారి చూద్దాం.

india
భారత్

By

Published : Aug 28, 2021, 8:48 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై ఘన విజయం. అదీ క్రికెట్ మక్కా లార్డ్స్​లో మరపురాని గెలుపు. ఇక సిరీస్​లో తిరుగులేదు.. ఈసారి సిరీస్​ మనదే అనుకున్న టీమ్ఇండియా అభిమానులు. ఆ ఉత్సాహంతోనే లీడ్స్​ మ్యాచ్​లో లీనమైపోయారంతా. కానీ వారి ఆశ నిరాశైంది. గెలుపేమో కానీ ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్​మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్​కు క్యూ కడుతుంటే కోహ్లీసేన డైహార్డ్ ఫ్యాన్స్ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. మరికొందరైతే 'ఈ మ్యాచ్ జరగలేదు. మేం చూడలేదు' అంటూ.. ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు అప్రతిష్టను, అభిమానులకు నిరాశను మిగిల్చిన లీడ్స్ మ్యాచ్ హైలెట్స్ చూద్దాం.

ఈ మ్యాచ్​లో శనివారం 212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 66 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్‌ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడం వల్ల భారత బ్యాట్స్‌మెన్‌ ఒక్క సెషన్‌ కూడా నిలవలేకపోయారు. చివరికి 278 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో సిరీస్​ 1-1 తేడాతో సమమైంది. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2న లండన్ వేదికగా ప్రారంభంకానుంది.

ఇవీ చూడండి: IndvsEng: 'మూడో టెస్టులో అందుకే ఓడిపోయాం'

ABOUT THE AUTHOR

...view details