ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆచితూచి ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 432 పరుగులు చేయడం వల్ల వారికి 354 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు ఓపెనర్లు రోహిత్ (25*), రాహుల్ (8) శుభారంభాన్ని అందించడానికి కృష్టి చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు స్వింగ్, బౌన్స్‌తో ఇబ్బంది పెడుతున్నా.. ఓపికతో ఆడుతూ స్కోర్ బోర్డును కదిలించారు. ఈ క్రమంలోనే లంచ్ సమయానికి ముందు రాహుల్‌ను బోల్తా కొట్టించాడు ఓవర్టన్. దీంతో 34 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది కోహ్లీసేన. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంకా 320 పరుగుల వెనుకంజలో ఉంది.
INDVSENG Lunch: పరుగుల కోసం చెమటోడుస్తున్న భారత్
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టు మూడో రోజు లంచ్ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. ఇంకా 320 పరుగుల వెనుకంజలో ఉంది.
రోహిత్
ఇక, ఓవర్‌నైట్ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన రూట్ సేన మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఆటగాడు రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో మరో 9 పరుగులు చేసి 432 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్.