ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా టాస్ ఓడిపోయిన కోహ్లీ ఈసారి టాస్ గెలవడం వల్ల అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు ఉండలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ రాహుల్ (0) డకౌట్‌గా వెనుదిగిరాడు. అనంతరం పుజారా కూడా ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కాసేపు కుదురుకునే ప్రయత్నం చేశాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేలా కనిపించాడు. కానీ అండర్సన్ మరోసారి భారత్‌ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ 21 పరుగుల వద్ద కోహ్లీ(7)ని ఔట్ చేశాడు.
అండర్సన్ ఆన్ ఫైర్.. కుప్పకూలిన భారత టాపార్డర్ - INDvsENG third test
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత టాపార్డర్ చేతులెత్తేసింది. అండర్సన్ దాటికి తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. కోహ్లీ, పుజారా, రాహుల్ విఫలమయ్యారు.
భారత్
అండర్సన్ ఆన్ ఫైర్
బ్రాడ్, వుడ్, ఆర్చర్ లాంటి ప్రధాన బౌలర్లు లేకుండా బరిలో దిగింది ఇంగ్లాండ్. పేస్ బౌలింగ్‌లో వీరికున్న ఒకే ఒక్క సీనియర్ బౌలర్ అండర్సన్. ఆ బాధ్యతను అతడు సక్రమంగా నిర్వర్తించాడు. ప్రారంభంలో పిచ్ సహకారాన్ని అందుకుని టీమ్ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. లార్డ్స్ సెంచరీ హీరో రాహుల్‌తో పాటు పుజారా, కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్‌ను 10 సార్లు ఔట్ చేశాడు అండర్సన్.