ఎట్టకేలకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 132.2 ఓవర్లు ఆడిన ఆ జట్టు 432 పరుగులు చేసింది. 354 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
ఇంగ్లాండ్ 432 ఆలౌట్.. భారత్‌పై భారీ ఆధిక్యం - భారత్-ఇంగ్లాండ్ లైవ్ స్కోర్
భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకు ఆలౌటైంది ఇంగ్లాండ్. భారత్ ముందు 354 పరుగులు ఆధిక్యాన్ని ఉంచింది.
ఓవర్‌నైట్ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన రూట్ సేన మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఆటగాడు రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. అండర్సన్ అజేయంగా నిలిచాడు.
టీమ్‌ఇండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం లీడ్స్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉదయం చిరుజల్లులు కురిశాయి. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అండర్సన్‌ను తట్టుకొని భారత్ నిలబడటం కష్టమే!