జోరుమీదున్న టీమ్ఇండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టేశాడు. 863 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్‌ను(842 పాయింట్లు) వెనక్కి నెట్టి ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలతో ధనాధన్ ఇన్నిగ్స్ ఆడిన సూర్య.. మెన్స్ ర్యాంకింగ్స్‌లోనూ రాకెట్‌లా దూసుకెళ్తున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య 68 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాతే ఈ మార్క్‌ను అందుకున్నాడు. అలాగే ఇదే టోర్నీలో నెదర్లాండ్స్‌పై కూడా కీలక హాఫ్ సెంచరీ చేశాడు.
ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న 23వ క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. అలాగే రెండో భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అంతకుముందు గతంలో ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.