ప్రపంచ క్రికెట్‌కు భారత్ అవసరం ఉందని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రిచర్డ్ హెడ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియాలో అద్భుత విజయంతో కోహ్లీసేన టెస్టు క్రికెట్‌కు మళ్లీ బతికించిందని ప్రశంసించాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ మున్ముందు మరింత ఆసక్తికరంగా మారొచ్చని అంచనా వేశాడు.
"టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఒక్క మ్యాచే కాబట్టి రెండు జట్లూ ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. తటస్థ వేదిక కావడం వల్ల ఆసక్తిగా అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో బంతి బాగా స్వింగ్ అవుతుంది. కివీస్‌లో సౌథీ, బౌల్ట్, జేమీసన్ వంటి నాణ్యమైన పేసర్లు ఉన్నారు. ఇక భారత్, కివీస్ రెండు జట్లలోనూ తిరుగులేని బ్యాట్స్‌మెన్ ఉన్నారు. క్రికెట్ ద్వారా భారత్ భారీ ఆదాయం ఆర్జిస్తోంది. అందుకే టీమ్‌ఇండియా లేకుంటే ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రం భిన్నంగా ఉండేది. ఆసీస్ చేతిలో 36కే ఆలౌటైనా సిరీస్ గెలిచి టెస్టు క్రికెట్‌ను బతికించింది. కుర్రాళ్లు అదరగొట్టారు. భారత్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడగల ప్రతిభావంతులు ఉన్నారు."