భారత్-శ్రీలంక పర్యటన కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆతిథ్య జట్టు లంకలో బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్‌లకు కరోనా సోకడమే ఇందుకు కారణం. దీంతో జులై 13న జరగాల్సిన తొలి మ్యాచ్‌ను 17వ తేదీకి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
కరోనా కలకలం.. భారత్-శ్రీలంక మ్యాచ్‌లు రీషెడ్యూల్ - భారత్ శ్రీలంక మ్యాచ్
కరోనా ప్రభావం టీమ్ఇండియా మ్యాచ్‌లపై పడింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ల్ని నాలుగురోజుల ముందుకు జరిపారు. ఈ పర్యటనలో భాగంగా తలో మూడు వన్డేలు, టీ20లు నిర్వహించనున్నారు.
భారత్-శ్రీలంక తొలి వన్డే వాయిదా
ప్రస్తుతం లంకలో ఉన్న టీమ్ఇండియా జట్టు.. ప్రాక్టీసులో బిజీగా ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. మన టీమ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహిస్తాడు.
మూడు వన్డేలు వరుసగా జులై 17, 19, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. టీ20లు జులై 24, 25, 27 తేదీల్లో జరపనున్నట్లు ప్రకటించారు.