వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో మహిళల క్రికెట్ ప్రపంచకప్ (Women's Cricket World Cup 2022) జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించనుంది భారత మహిళల జట్టు. అందుకు సన్నాహకంగా వైట్ ఫెర్న్స్ తో (కివీస్ మహిళల జట్టు ముద్దు పేరు) 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది (INDW VS NZW). ఫిబ్రవరి 9న ఒకే ఒక టీ20తో మొదలయ్యే పర్యటన ఫిబ్రవరి 24న పూర్తవుతుంది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన వరల్డ్‌కప్ 2022 మార్చి-ఏప్రిల్‌లో జరగనుంది.
ఇదీ షెడ్యూల్:
ఫిబ్రవరి 9: ఏకైక టీ20 మ్యాచ్ (నేపియర్)
ఫిబ్రవరి 11: తొలి వన్డే (నేపియర్)
ఫిబ్రవరి 14: రెండో వన్డే (నెల్సన్)
ఫిబ్రవరి 16: మూడో వన్డే (నెల్సన్)
ఫిబ్రవరి 22: నాలుగో వన్డే (క్వీన్స్టౌన్)
ఫిబ్రవరి 24: ఐదో వన్డే (క్వీన్స్టౌన్)
టీమ్ఇండియా మ్యాచ్‌తోనే ఆరంభం..
2022 కామన్వెల్త్ (Commonwealth Games 2022) మహిళల క్రికెట్ పోటీలు వచ్చే ఏడాది జులై 29న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌తో (Commonwealth Games 2022 India) ఆరంభం కానున్నాయి. టీ20 ఫార్మాట్‌తో కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ అరంగేట్రం చేస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 1998 ఎడిషన్‌లో (కౌలాలంపూర్) క్రికెట్ చివరిసారి ఆడారు. ఆగస్టు 7న కాంస్యం, బంగారు పతకం కోసం మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్‌లో కివీస్ పర్యటన..
పురుషుల టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) గ్రూప్ దశలో టీమ్ఇండియాను ఓడించి సెమీస్ చేరిన కివీస్.. ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం (నవంబర్ 14న) టైటిల్ పోరు జరగనుంది. ఆ తర్వాత భారత్‌లో పర్యటించనుంది (New Zealand Tour of India) కివీస్. నవంబర్ 17 నుంచి మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. బయోబబుల్ కారణంగా పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్ హోమ్ టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నారని పేర్కొంది.
న్యూజిలాండ్(టెస్టు జట్టు):
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్
న్యూజిలాండ్(టీ20 జట్టు):
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్తిల్, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్ (వికెట్ కీపర్), ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే
ఇదీ షెడ్యూల్:
భారత్, కివీస్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపుర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.
ఇదీ చూడండి:కివీస్‌తో టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్, పంత్‌కు విశ్రాంతి