న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC final)కు ముందు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను టీమ్ఇండియా ముగించింది. మూడో రోజు రోహిత్ శర్మ(Rohit Sharma), అజింక్య రహానె(Ajinkya Rahane), మయాంక్ అగర్వాల్(Mayank) తదితరులు బ్యాటింగ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో భారత నియంత్రణ మండలి(BCCI) పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆల్‌రౌండర్ జడేజా కవర్‌డ్రైవ్ ఆడుతుండగా.. కోచ్ రవిశాస్త్రి(Ravi Sasthri) డ్రస్సింగ్ రూమ్ దగ్గర్నుంచి ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్నాడు.
WTC Final: ముగిసిన టీమ్ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ - మయాంక్ అగర్వాల్
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సన్నద్ధమవుతున్న టీమ్ఇండియా(Team India).. సౌథాంప్టన్‌లో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ముగించింది. రోహిత్, రహానె, మయాంక్ సహా పలువురు బ్యాటింగ్ చేయగా.. కోచ్ రవిశాస్త్రి డ్రస్సింగ్ రూమ్ బాల్కానీ నుంచి సూచనలు ఇస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
WTC Final: ప్రాక్టీస్ మ్యాచ్ ముగిసింది.. ఇక సమరమే!
సౌథాంప్టన్ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు జరగనుంది. 23వ తేదీని రిజర్వ్ డే ఉంచారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కివీస్ జట్టు విజేతగా నిలిచింది. భారత జట్టుకు ఫైనల్లో తలపడేందుకు కివీస్ జట్టు సన్నద్ధమవుతోంది.
ఇదీ చూడండి..WTC Final: సౌథాంప్టన్ పిచ్ రిపోర్ట్ ఇదే!