తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC final: టీమ్ఇండియా క్వారంటైన్ కొన్నిరోజులే​! - ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు

డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)​ కోసం టీమ్​ఇండియా క్వారంటైన్​లో ఉండాల్సిన రోజుల సంఖ్యను తగ్గించనుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఎన్ని రోజులనేది స్పష్టంగా చెప్పనప్పటికీ.. నిర్బంధంలో ఉండాల్సిన సంఖ్య తక్కువేనని ఐసీసీ స్పష్టం చేసింది.

WTC, ICC
డబ్ల్యూటీసీ, ఐసీసీ

By

Published : May 29, 2021, 5:06 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్(World Test championship)​ ఫైనల్​ కోసం యూకే వెళ్లనున్న భారత ఆటగాళ్లకు క్వారంటైన్ విషయంలో సడలింపులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఎన్ని రోజులు అనేది స్పష్టంగా చెప్పనప్పటికీ నిర్బంధంలో ఉండాల్సిన రోజుల సంఖ్య తక్కువే కానుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పష్టం చేసింది.

ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్​లో పాల్గొననున్న కివీస్.. ఇంగ్లాండ్​తో రెండు టెస్టుల నిమిత్తం అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం 14 రోజుల తప్పనిసరి నిర్బంధంలో ఉన్న కోహ్లీసేన కూడా జూన్​ 3న యూకే చేరుకోనుంది. ​

"కొవిడ్ నేపథ్యంలో 2021 మే 17న యూకే ప్రభుత్వం క్వారంటైన్​లో ఎన్ని రోజులు ఉండాలనేది సూచించింది. ప్రస్తుతం దీని నుంచి ఇంగ్లాండ్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. క్వారంటైన్​కు వెళ్లేముందు భారత ఆటగాళ్లందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తాం"

-ఐసీసీ(ICC)

కివీస్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ముందు మూడ్రోజుల తప్పనిసరి క్వారంటైన్​లో ఉంచింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. మరి కోహ్లీ సేనకు ఎన్ని రోజుల నిర్బంధంలో ఉంచనుందో వేచిచూడాలి.

ఇదీ చదవండి:wtc final: రెట్రో లుక్​ జెర్సీతో టీమ్ఇండియా

ABOUT THE AUTHOR

...view details