ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్(IndvsEng)లో నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్ వ్యూహంతో బరిలో దిగితే మిగతా రెండు మ్యాచ్‌లు టీమ్ఇండియా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్. ఆరో బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ బలంగా తయారవుతుందని సూచించాడు. నాలుగో టెస్టుకు అతడిని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. మూడో మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"బ్యాటింగ్ లైనప్ బలంగా తయారవ్వాలంటే జట్టులోకి హనుమ విహారిని తీసుకోవాలని అంటున్నారు. కానీ అతడికి బదులు సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకుంటే మంచిది. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నా దీన్ని నేను బలంగా నమ్ముతున్నా. టీమ్ఇండియాలోని అద్భుత ఆటగాళ్లతో సమానంగా సూర్యలోనూ నైపుణ్యాలు ఉన్నాయి. అతడు ప్రతిభ ఉన్న ఆటగాడు. ఇప్పటికే జట్టులోకి అతడిని తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఇక తుది జట్టులో అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో ఇప్పటికీ నాకు మిస్టరీగానే ఉంది. అతడిని తీసుకోకపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఏదేమైనప్పటికీ మిగతా మ్యాచ్‌లు గెలవాలంటే టీమ్ఇండియా నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగాలి."