Indian Team Middle Order: కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలి టెస్టుతో.. టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్లో కూడా కొత్త శకం ఆరంభం కానుంది. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానెకు దీర్ఘకాల ప్రత్యామ్నాయంగా శుభ్‌మన్ గిల్, హనుమ విహారి సిద్ధంగా ఉండటమే అందుకు కారణం. ఈ సీజన్లో (శ్రీలంకతో 2, ఇంగ్లాండ్‌లో ఒకటి) రహానె, పుజారాలకు జట్టులో స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే దశాబ్దకాలం వారు సొంతం చేసుకున్న స్థానాలను భర్తీ చేసేందుకు గిల్, విహారి సహా శ్రేయస్ అయ్యర్ సంసిద్ధమయ్యారు.
అయితే మార్చి 4న ప్రారంభంకానున్న తొలి టెస్టులో ముగ్గురిలో ఎవరిని పక్కనపెడతారనే విషయం ఆసక్తిగా మారింది. మొహాలీలో జరగనున్న ఈ మ్యాచ్ మాజీ సారథి విరాట్ కోహ్లీకి 100వది కావడం విశేషం.
శుభ్‌మన్ గిల్‌కు ఉన్న ఉత్సాహం, పరిస్థితులకు తగినట్లుగా గేర్ మార్చి ఆడే స్వభావం రీత్యా అతడిని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. రోహిత్, మయాంక్ అగర్వాల్ తర్వాత అతడు నెం.3లో రావొచ్చు.
రహానె నెం.5లో ఆడేవాడు. కానీ విహారిని 6వ స్థానంలో ఆడించి, వేరియేషన్ కోసం ప్రమాదకర బ్యాటర్ రిషభ్ పంత్‌ను 5లో దించే అవకాశం ఉంది. "మయాంక్, రోహిత్, గిల్, విరాట్ అందరూ రైట్‌హ్యాండ్ బ్యాటర్లు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం నెం.5లో లెఫ్ట్ హ్యాండర్ ఉంటే మేలు. ఆ తర్వాత విహారి వస్తే.. 7లో మళ్లీ లెఫ్ట్ హ్యాండర్ రవీంద్ర జడేజా వస్తాడు. ఈ పద్ధతిలో వెళ్లేందుకు ఆస్కారం ఉంది." అని ఓ మాజీ సెలక్టర్ వివరించారు.
ఇక అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ తుది జట్టులో స్థానం కోసం మరి కొంతకాలం వేచిచూడాల్సి రావొచ్చు. అయితే ఎవరైనా ఫిట్‌గా లేరని తేలితే వరుసలో మొదట ఉండేది అతడే!
టీమ్ఇండియా తుది జట్టు (అంచనా):రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ (ఫిట్నెస్)/ జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
ఇదీ చూడండి:Team India: 3 సిరీస్‌లు గెలిచినా.. వీటికి సమాధానమేది?