తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెగా టోర్నీల 2023కి 'వెలకమ్‌'.. ఈ ఏడాదైనా టీమ్​ఇండియా సత్తా చాటుతుందా? - indian mens cricket team 2023

కొత్త సంవత్సరంలోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. 2023లో వన్డే ప్రపంచకప్‌తోపాటు టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌, ఆసియా కప్‌ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీల్లో భారత క్రికెట్​ జట్టు.. సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Team India 2023 Schedule
Team India 2023 Schedule

By

Published : Jan 1, 2023, 2:58 PM IST

గతేడాది ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ల్లో ఎదురైన పరాభావాలను మర్చిపోతూ కొత్త సంవత్సరంలోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. ఈ ఏడాది టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యమైనది. కీలకమైన వరల్డ్‌ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌, వన్డే ప్రపంచకప్‌, ఆసియా కప్‌ 2023లో జరగనున్నాయి. ఈ సారి ప్రపంచ కప్‌ టోర్నీకి భారతే ఆతిథ్యం ఇవ్వనుంది. గతేడాది మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం ఐసీసీ మెగా టోర్నీలతోపాటు ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌తో నూతన సంవత్సరానికి స్వాగతం పలకనుంది భారత్‌. జనవరి 3 నుంచి స్వదేశంలో ఈ పొట్టి సిరీస్‌ ప్రారంభంకానుంది. ఓ సారి 2023లో టీమ్‌ఇండియా పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.

శ్రీలంకతో మూడు టీ20, వన్డేల సిరీస్‌

  • జనవరి 3 తొలి టీ20 ముంబయి
  • జనవరి 5 రెండో టీ20 పుణె
  • జనవరి 7 మూడో టీ20 రాజ్‌కోట్‌
  • జనవరి 10 తొలి వన్డే గుహవాటి
  • జనవరి 12 రెండో వన్డే కోల్‌కతా
  • జనవరి 15 మూడో వన్డే తిరువనంతపురం

న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, టీ20ల సిరీస్‌

  • జనవరి 18 తొలి వన్డే హైదరాబాద్‌
  • జనవరి 21 రెండో వన్డే రాయ్‌పూర్‌
  • జనవరి 24 మూడో వన్డే ఇందౌర్‌
  • జనవరి 27 తొలి టీ20 రాంచీ
  • జనవరి 29 రెండో టీ20 లఖ్‌నవూ
  • ఫిబ్రవరి 01 మూడో టీ20 అహ్మదాబాద్‌

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన (నాలుగు టెస్టులు,వన్డేలు)

  • ఫిబ్రవరి 9-14 తొలి టెస్టు నాగ్‌పూర్‌
  • ఫిబ్రవరి 17-21 రెండో టెస్టు దిల్లీ
  • మార్చి 1-5 మూడో టెస్టు ధర్మశాల
  • మార్చి 9-13 నాలుగో టెస్టు అహ్మదాబాద్‌
  • మార్చి 17 తొలి వన్డే ముంబయి
  • మార్చి 19 రెండో వన్డే విశాఖపట్నం
  • మార్చి 22 మూడో వన్డే చెన్నై
  • ఏప్రిల్‌- మే ఐపీఎల్‌ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విరామం
  • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2021-23 ఫైనల్‌

జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉంటుంది. తేదీలు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుంది. జులై, ఆగస్టు మధ్య టీమ్‌ఇండియా.. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ కరేబియన్‌ జట్టుతో రెండు టెస్టులు (2023-29 డబ్ల్యూటీసీలో భాగం), మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లకు సంబంధించిన మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. సెప్టెంబరులో స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది. ఇదే నెలలో ఆసియా కప్‌ జరగనుండగా.. మ్యాచ్‌ల తేదీలను వెల్లడించలేదు. ఇక, అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో కీలకమైన వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆడనుంది. వరల్డ్ కప్‌ ముగిసిన తర్వాత నవంబర్‌లో భారత్‌, ఆసీస్‌ మధ్య ఐదు టీ20లు జరగనున్నాయి. 2023 డిసెంబరు- 2024 జనవరి మధ్య టీమ్‌ఇండియా.. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు, మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది.

ABOUT THE AUTHOR

...view details