తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీపై పాక్​ ఫ్యాన్​ కామెంట్​.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఇండియన్​! - పాకిస్థాన్​ అభిమాని

Babar Azam vs Virat Kohli: పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​తో కోహ్లీని పోలుస్తూ ఆ దేశానికి చెందిన ఓ వ్యక్తి చేసిన కామెంట్​కు దిమ్మతిరిగే సమధానమిచ్చారు ఓ భారత అభిమాని. ఇరువురి అభిమానుల మధ్య జరిగిన ఈ ట్విట్టర్​ వార్​ ఏమిటి?

Babar Azam vs Virat Kohli
విరాట్​ కోహ్లీ, బాబర్​ అజామ్​

By

Published : Apr 6, 2022, 5:14 PM IST

Babar Azam vs Virat Kohli: భారత రన్​ మిషన్​ విరాట్​ కోహ్లీ, పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​లు మేటి క్రికెట్​లో అద్భుత ఆటగాళ్లు. తమ బ్యాటింగ్​తో ప్రపంచవ్యాప్తంగా యంగ్​ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్యాట్​తో రికార్డులు కొల్లగొట్టటం వారికి వెన్నతో పెట్టిన విద్య. అయితే.. ఇరువురి అభిమానుల మధ్య ట్విట్టర్​ వేదికగా జరిగిన వార్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

సామాజిక మాధ్యమాల వేదికగా ఇతర దేశాల ఫ్యాన్స్​కు భారత అభిమానులు గుణపాఠాలు నేర్పిన సందర్భాలు కోకొల్లలు. చాలా సందర్భాల్లో ప్రత్యర్థి ఫ్యాన్స్​ లాజిక్​ లేని వాదనలు చేస్తూ.. తామే గొప్పని పొరబడినవి చూశాం. అలాంటేదే ఒకటి తాజాగా జరిగింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​లో బాబర్​ అజామ్​ కొట్టిన సిక్స్ వీడియోను పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ట్విట్టర్​లో పోస్ట్​ చేసి సెన్సేషన్​ షాట్​ అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా కోహ్లీని బాబర్​ అజామ్​తో పోలుస్తూ ఓ పాకిస్థానీ ఫ్యాన్ ఈ వీడియో కింద కామెంట్​ చేశాడు. బాబర్​ స్థాయిని కోహ్లీ ఎప్పటికీ అందుకోలేడని పేర్కొన్నాడు. దీనికి ఓ భారత అభిమాని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

పాక్​ ఫ్యాన్​ కామెంట్​

ఆ కామెంట్​కు సమాధానంగా దిల్లీ డేర్​డెవిల్స్​, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​లో ట్రెంట్​ బౌల్డ్​ బౌలింగ్​లో విరాట్​ కోహ్లీ సిక్స్​ కొట్టిన వీడియోను షేర్​ చేశాడు. ఈ వీడియోకు వందల మంది ఫ్యాన్స్​ లైక్​ చేశారు. సరైన సమాధానం అంటూ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఐసీసీ ప్లేయర్​ ఆప్​ ది మంత్​ రేసులో వీరే!

ABOUT THE AUTHOR

...view details