సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలది విడదీయరాని బంధం. ఈ రెండింటికి ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది. అందుకే వీటికి సంబంధించి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఇక క్రికెటర్స్ -హీరోయిన్స్ మధ్య ఎఫైర్ ఉంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మధ్య ప్రేమాయణం ఈనాటిది కాదు.. నాటి ఇమ్రాన్ ఖాన్- దీవా జీనత్, కపిల్‌దేవ్-సారికా నుంచి నేటి విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ వరకు ఎందరో క్రికెటర్లు-హీరోయిన్ల మధ్య ప్రేమకథలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో చాలా వరకు మధ్యలోనే బ్రేకప్ అవ్వడం.. కొన్ని అవి నిజం కాదని తేలడం, మరికొన్ని పెళ్లి పీటలు వరకు వెళ్లడం జరిగాయి. అయితే ప్రేమలో విజయవంతమయ్యి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో తెలుసా?
బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లాడిన క్రికెటర్లు ఎవరంటే?
1) మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిళా ఠాగూర్.
ఒక్కప్పటి భారత టెస్టు క్రికెట్ జట్టులో టైగర్ పటౌడీ(మన్సూర్ అలీఖాన్ పటౌడీ) ఓ యువ క్రికెటర్. 1965లో దిల్లీ వేదికగా జరిగిన ఓ పార్టీలో హీరోయిన్ షర్మిళా ఠాగూర్, టైగర్ పటౌడీ కలసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది పెళ్లికి దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు మతాలైన కారణంగా వీరి వివాహాన్ని అనేకమంది తప్పుబట్టారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 1969లో వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
2) మహ్మద్ అజారుద్దీన్, సంగీతా బిజ్లానీ
టీమ్ఇండియా విజయవంతమైన కెప్టెన్లలో మహ్మద్ అజారుద్దీన్ ఒకరు. 1985లో జరిగిన ఓ యాడ్ షూట్ ద్వారా బాలీవుడ్ హీరోయిన్ సంగీతా బిజ్లానీని అజారుద్దీన్ తొలిసారి కలిశాడు. అప్పుడు వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. అది ప్రణయానికి దారి తీసింది. 1996లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2010లో విడాకులు తీసుకున్నారు.
3) హర్భజన్ సింగ్, గీతా బస్రా
'ది ట్రైన్', 'దిల్ దియా హై' చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది బాలీవుడ్ నటి గీతా బస్రా. ఆమె నటనకు స్పిన్నర్ హర్భజన్ ఫిదా అయ్యాడు. 2015, అక్టోబరు 29న వీరిద్దరూ వివాహబంధం ద్వారా ఒక్కటయ్యారు.