దిగ్గజ ఆటగాడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఇంట విషాదం నెలకొంది. అతడి తల్లి మీనల్ గావస్కర్ (95) కన్నుమూశారు. అయితే తల్లి మరణవార్త విన్నప్పటికీ తన వృత్తి నిబద్ధతను చాటుకున్నాడు ఈ దిగ్గజ క్రికెటర్. ఆటపై తనకు ఉన్న కమిట్మెంట్ను చూపించాడు. తల్లి మరణించినా గానీ టీమ్ఇండియా-బంగ్లా మ్యాచ్‌లో కామెంటరీ చేశాడు.
సునీల్ గావస్కర్ ఇంట తీవ్ర విషాదం.. అయినా కామెంటరీ చెప్పిన లిటిల్ మాస్టర్ - Meenal Gavaskar passed away
దిగ్గజ ఆటగాడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఇంట విషాదం నెలకొంది. అతడి తల్లి మీనల్ గావస్కర్ తుది శ్వాస విడిచారు. అయినా గావస్కర్ బాధను దిగమింగుకుని తన కామెంటరీ బాధ్యతలను నిర్వర్తించాడు.
![సునీల్ గావస్కర్ ఇంట తీవ్ర విషాదం.. అయినా కామెంటరీ చెప్పిన లిటిల్ మాస్టర్ Sunil Gavaskar shows commitment and continues his duty](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17312409-thumbnail-3x2-gavaskar.jpg)
విషయానికొస్తే.. కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన సునీల్ గావస్కర్ ఆ తర్వాత కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. అలానే భారత్-బంగ్లాతో మ్యాచ్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టు మ్యాచ్ నాలుగు రోజు(ఆదివారం) ఆట జరుగుతున్నప్పుడు సునీల్ గావస్కర్ తల్లి మీనల్ గవాస్కర్ (95) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. గావస్కర్ మ్యాచ్‌కు కామెంటరీ చేస్తున్న తరుణంలోనే తన తల్లి మరణవార్త తెలిసింది. అయినా అతడు ఆటపై తనకు ఉన్న ప్రేమను, నిబద్ధతను చాటుకున్నాడు. తల్లి మరణవార్తను దిగమింగుకుని కామెంటరీ చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు సునీల్ గావస్కర్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, మీనల్ మరణంతో గావస్కర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:IND Vs BAN: 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' పుజారాకు ఎందుకిచ్చారబ్బా.. మరి శ్రేయస్?