టీమ్ఇండియా ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఆట నుంచి తప్పుకుంటున్నట్లు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల మురళీ విజయ్, కొన్నేళ్ల క్రితం బీసీసీఐ పట్టించుకోవడం లేదని, ఫారిన్ లీగుల్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కామెంట్ చేశాడు. ఈ కామెంట్లు చేసిన కొన్ని రోజులకే భారత్ జట్టుకు వీడ్కోలు పలికాడు. ఈ మేరక ఓ సుదీర్ఘ పోస్ట్ కూడా చేశాడు. తన కెరీర్‌లో అండగా నిలిచివారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
2008లో టీమ్ఇండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్.. 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు ఓపెనర్‌గా మారాడు మురళీ విజయ్ వచ్చాడు. అయితే మురళీ విజయ్ వరుసగా విఫలమవ్వడంతో రోహిత్ శర్మను ఓపెనర్‌గా టెస్టుల్లోకి తిరిగి తీసుకొచ్చారు. దీంతో మురళీ విజయ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. రోహిత్ శర్మకు జోడీగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి కుర్రాళ్లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన బీసీసీఐ, మురళీ విజయ్‌ను పక్కనపెట్టేసింది.
అతడు టెస్టు ఓపెనర్‌గా 61 మ్యాచులు ఆడాడు. 3982 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 15 హఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 వన్డేలు ఆడిన ఈ చెన్నై క్రికెటర్.. 21.18 సగటుతో 339 పరుగులు చేశాడు. 9 టీ20 మ్యాచులు ఆడి 169 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్ తరుపున ఆడిన మురళీ విజయ్... ప్రస్తుతం అతడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐపీఎల్ 2021, 2022, 2023 సీజన్లలో తన పేరును రిజిస్టర్ చేయించుకున్నా మురళీ విజయ్‌ని ఎవరూ కొనుగోలు చేయడానికి ఇష్టపడటం లేదు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో 106 మ్యాచులు ఆడి 25.93 సగటుతో 2619 పరుగులు చేసిన మురళీ.. అందులో 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు చేశాడు.
దినేశ్ భార్యతో వివాహేతర సంబంధం.. టీమ్ఇండియాకు మంచి టెస్టు ఓపెనర్‌గా మారుతున్న సమయంలో దినేశ్ కార్తీక్ భార్య నిఖితాతో వివాహేతర సంబంధం పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్నాడు మురళీ విజయ్. ఈ విషయం తెలిసిన దినేశ్ కార్తీక్.. నిఖితకి విడాకులు ఇవ్వడం.. మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది.
రిటైర్మెంట్ ప్రకటించిన మురళీ విజ ఇదీ చూడండి:రెండో టీ20లో బౌలర్ల మ్యాజిక్.. బ్యాటర్లకు 'పిచ్' ఎక్కించిందిగా..