Ishan Kishan Real Estate : టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఆ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎందుకంటే ఇటీవలే అతడు బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు ఈ కుర్ర బ్యాటర్. ఇప్పుడు అతడి గురించి మరో విషయం తెలిసింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంటి పక్కన భూమి కొనుగోలు చేసినట్లు ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ తెలిపాడు. రాంచీలోని సిమ్లియా రింగ్ రోడ్‌లో ఉన్న ధోనీ ఫామ్ హౌస్‌కు దగ్గర్లో ఈ భూమి ఉన్నట్లు ఆయన తెలిపాడు. అయితే ఇషాన్ రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఇషాన్ కిషన్.. కొత్త అక్కడ ఇల్లు నిర్మిస్తాడని చెబుతున్నారు.
ధోనీ ఇంటిపక్కనే ఇషాన్ కొత్త హౌస్! - ఇషాన్ కిషన్ న్యూ బిజినెస్
భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రారంభించబోతున్నాడని తెలుస్తోంది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫామ్ హౌస్‌కు దగ్గర్లో భూమి కొనుగోలు చేసినట్లు ఇషాన్ కిషన్ తండ్రి తెలిపాడు.
ధోని
బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాది ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ తెందుల్కర్ మాత్రమే వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించారు. అయితే కేవలం 126 బంతుల్లోనే 200 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. డబుల్ సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడైన బ్యాటర్‌గా కూడా నిలిచాడు.
Last Updated : Dec 14, 2022, 10:35 PM IST