అమ్మాయిలా.. ఆడ పులులా అన్నట్టు అడుగడుగునా ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు టీమ్ఇండియా ప్లేయర్లు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌పై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొలి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ఇండియా. షెఫాలీ వర్మ 15, శ్వేతా 5, సౌమ్య 24, గొంగడి త్రిష 24 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హన్నా బేకర్, సోఫియా, అలెక్సా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్19 టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమ్ఇండియా - womens u19 world cup final 2023
భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. తొలి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. కాగా, గెలిచిన టీమ్‌కు రూ. 5 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ ప్రకటించింది.
india england u19 world cup final
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 17.1 ఓవర్లలో 68 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నియామ్ 10, రియానా 19, అలెక్సా 11, సోఫియా 11 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించారు. టిటాస్ సధు, అర్చనా దేవి, పార్శవి తలో రెండు వికెట్లు తీశారు. మన్నత్, శెఫాలీ, సోనం ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా, గెలిచిన టీమ్‌కు రూ. 5 కోట్ల ప్రైజ్ మనీని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Last Updated : Jan 29, 2023, 7:59 PM IST