పొట్టి కప్పు సమరంలో దాయాదులు తలపడుతున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గౌండ్‌లో అభిమానుల కోలాహలం మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచింది. బౌలింగ్ ఆప్షన్‌ను ఎంచుకుంది. అయితే రెండు జట్లు బలంగానే ఉన్నాయి. భారత్‌తో పోలిస్తే పాక్ బౌలింగ్ లైనప్ కాస్త మెరుగ్గా ఉంది. భారత ఓపెనర్లు చెలరేగి.. బౌలింగ్, ఫీల్డింగ్ పెద్ద తప్పులు చేయకుండా ఆడితే టీమ్ ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది.
T20 World Cup : పాక్‌కు స్లో స్టార్ట్.. అభిమానులతో హోరెత్తిన స్టేడియం - భారత్ పాక్ మ్యాచ్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. సూపర్ 12 దశలో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది.

india vs pakistan match
మరోవైపు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా అభిమానులు కూడా మ్యాచ్ కోసం ఆత్రుతగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌పై భారత్ పాక్ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఓ వీడియో వైరల్ అయ్యింది. అందులో ఈ సారి పాకిస్థాన్‌పై భారత్ గెలుస్తుందని ఓ టీమ్ ఇండియా అభిమాని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన పాక్ ఫ్యాన్.. భారత్ సొంత గడ్డపై మాత్రమే గెలుస్తుందని బదులిచ్చాడు. దీంతో మాట మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది.