తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూర్య సూపర్ సెంచరీ.. కివీస్​తో టీ20 సిరీస్​లో టీమ్ఇండియా బోణీ

India vs New Zealand : న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో టీమ్ ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

INDIA VS NEW ZEALAND
INDIA VS NEW ZEALAND

By

Published : Nov 20, 2022, 4:10 PM IST

Updated : Nov 20, 2022, 4:20 PM IST

India vs New Zealand : న్యూజిలాండ్​తో జరిగిన రెండో టీ20 మ్యాచ్​​లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ఫామ్​ లేమితో బాధపడుతున్న కేన్​ విలియమ్సన్ (65) పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు. డెవాన్ కాన్వే (25), గ్లెన్​ ఫిలిప్స్​(12), డార్లీ మిచెల్(10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీపక్​ హుడా(4), చాహల్​, సిరాజ్​ 2 చొప్పున, అర్షదీప్​, భువీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమ్​ఇండియా మిస్టర్​ 360 ఆటగాడు సూర్య కుమార్​ యాదవ్​ సూపర్​ సెంచరీతో మెరుపు షాట్లు ఆడాడు. ఇషన్​ కిషన్ 36 పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. శ్రేయస్​ అయ్యర్​(13), హార్దిక్​ పాండ్య(13) పరుగులు చేసి నిరాశపర్చారు. రిషబ్​ పంత్​(6) విఫలం కాగా.. దీపక్​ హుడా(0), వాషింగ్టన్​ సుందర్(0) గోల్డెన్​ డక్​ ఔట్​ అయ్యారు. న్యూజిలాండ్​ బౌలర్లు సౌథీ(3), లాకీ ఫెరుగుసన్(2), ఇష్ సోధి(1) వికెట్​లు తీశారు. చివరి ఓవర్లో సౌథీ హ్యాట్రిక్ తీయడం గమనార్హం.

సూర్య కుమార్​ సూపర్​ సెంచరీ..
టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టీ20 కెరీర్‌లో రెండో శతకం బాదాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత అర్ధశతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను దాటేశాడు. సూర్య ధీటైన ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా కివీస్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇవీ చదవండి :BCCI కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ ఎవరు?.. రేసులో ఇద్దరు మాజీలు!

రెండో టీ20 మ్యాచ్​కు కూడా వర్షం ముప్పు.. ఆందోళనలో ఫ్యాన్స్​

Last Updated : Nov 20, 2022, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details