ఇంగ్లాండ్‌తో తొలి రెండు వన్డేల్లో ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టు.. హోరాహోరీగా జరిగిన మూడో వన్డేలో అదరగొట్టింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. 50 ఓవర్లకు జరగాల్సిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47 ఓవర్లలో 219 పరుగులు చేసింది.
మూడో వన్డేలో భారత్ విజయం.. స్మృతి సూపర్ క్యాచ్ - స్మృతి మంధాన క్యాచ్
ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ స్మృతి మంధాన పట్టిన ఓ క్యాచ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
మూడో వన్డే
భారత జట్టు విజయంలో కెప్టెన్ మిథాలీ రాజ్ 75 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది. స్మృతి మంథానా(49), స్మేహ్ రానా(24) అదరగొట్టారు.
ఇంగ్లాండ్ జట్టులో ఎన్ సివర్ 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ హెచ్ నైట్(46), విన్ఫీల్డ్ హిల్(39) పరుగులతో రాణించారు.
Last Updated : Jul 4, 2021, 4:41 PM IST