తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంగ్లాండ్​కు​ క్లీన్​స్వీప్ తప్పదు.. కారణమిదే'​ - సునీల్ గావస్కర్

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో భారత్​ సత్తా చాటుతుందని తెలిపారు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. నాలుగు టెస్టుల సిరీస్​ను క్లీన్​ స్వీప్​ చేస్తుందని అంచనా వేశారు. ఎండాకాలం కావడం వల్ల అక్కడి పిచ్​లు టర్న్​ అవ్వడమే ఇందుకు కారణంగా విశ్లేషించారు.

gavaskar
గావస్కర్

By

Published : Jun 4, 2021, 1:59 PM IST

Updated : Jun 4, 2021, 2:06 PM IST

ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా అదరగొడుతుందని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అంచనా వేశారు. ఐదు టెస్టుల సిరీసు ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య జరుగుతోంది కాబట్టి 4-0తో గెలవగలదని ధీమా వ్యక్తం చేశారు. ఆంగ్లేయులు పిచ్‌లపై పచ్చికను ఉంచినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు.

భారత జట్టు బుధవారం ఇంగ్లాండ్‌కు చేరుకుంది. సౌథాంప్టన్‌లో ఆటగాళ్లంతా క్వారంటైన్‌ అయ్యారు. మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ తర్వాత వీరంతా కలిసే సాధన చేస్తారు. జూన్‌ 18న న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడతారు. ఆగస్టు, సెప్టెంబర్లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడతారు. ఈ సిరీసును రెండు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎండాకాలం కావడం వల్ల పిచ్‌లు టర్న్‌ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కోహ్లీసేన సిరీసును స్వీప్‌ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

"న్యూజిలాండ్‌తో ఫైనల్‌ ముగిసిన ఆరు వారాల తర్వాత ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఆరంభమవుతుంది. కాబట్టి ఫైనల్‌ ఫలితం ప్రభావం భారత్‌-ఇంగ్లాండ్‌ సిరీసుపై తక్కువగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్లో ఆడుతున్నారు కాబట్టి భారత్‌ 4-0తో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. భారత్‌లో పర్యటించినప్పుడు స్పిన్‌ పిచ్‌లపై ఆంగ్లేయులు పెదవి విరిచారు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో పిచ్‌లపై పచ్చికను ఉంచినా ఆశ్చర్యం లేదు. అది కోహ్లీసేనకు సమస్యేమీ కాదు. అలాంటి పిచ్‌లపై రాణించగల పేసర్లు మనకు ఉన్నారు. దాంతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కచ్చితంగా ఇబ్బంది పడతారు" అని గావస్కర్‌ అన్నారు.

ఇదీ చదవండి:'క్రికెటర్లంతా ఒకే మనస్తత్వంతో ఉండరు.. అందుకే!'

Last Updated : Jun 4, 2021, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details