India West Indies T20 Squad 2023 :వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరగనున్న టోర్నీ కోసం టీ20 జట్టుకు తాను సెలెక్ట్ అయిన విషయాన్ని.. తన చిన్నప్పటి ఫ్రెండ్ రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి చెప్పాడని యువ బ్యాటర్ తిలక్వెల్లడించాడు. టీమ్ఇండియా జట్టుకు ఎంపికైన విషయం తెలియగానే తన తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు తిలక్ తెలిపాడు. కాగా తిలక్ వర్మ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్ తరపున ఆడుతున్నాడు. నార్త్‌జోన్‌తో జరుగుతున్న సెమీస్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. ఇక తిలక్ విండీస్ పర్యటనలో టీ20 మ్యాచ్‌తో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు.
"నా చిన్ననాటి స్నేహితుడు నాకు ఫోన్ చేసి.. టీమ్ఇండియాకు సెలెక్ట్ అయ్యానని చెప్పేదాకా నాకు కూడా తెలీదు. అప్పుడు సమయం రాత్రి 8 అయ్యింది. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్నా.. కాబట్టి మధ్యాహ్నం ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంటుంది. అందుకని నాకు ఈ వార్త రాత్రి తెలిసింది. ఇక టీమ్‌ఇండియాకు ఎంపికయ్యానని తెలిసి వెంటనే అమ్మానాన్నలకు ఫోన్ చేశాను. వారు చాలా సంతోషించారు. వాళ్లతో వీడియో కాల్ మాట్లాడితే భావోద్వేగాని గురై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కోచ్ సలాం బయాష్ కూడా అలాగే స్పందించాడు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో గర్వకారణం. కానీ ఇప్పుడు నిద్రలో కూడా ప్రస్తుతం ఆడుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ గురించే ఆలోచిస్తాను. ఇప్పుడు నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాను కాబట్టి మరింత ఆత్మవిశ్వాసంతో ఆడతా. చిన్నప్పటి నుంచి తెల్లబంతి కంటే ఎర్రబంతి క్రికెట్‌నే ఎక్కువగా ఆడేవాడ్ని. ఎర్రబంతి మ్యాచ్‌లోనే మన నైపుణ్యాలకు సవాళ్లు ఎదురవుతాయని ఎప్పుడూ కోచ్‌లు చెప్పేవాళ్లు. తెల్లబంతి క్రికెట్ మానసిక దృక్పథానికి సంబంధించింది. కానీ ఎర్రబంతి క్రికెట్లో కఠిన పరిస్థితులు ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దులీప్ ట్రోఫీలో అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా"
- తిలక్ వర్మ, యువ బ్యాటర్.
Tilak Varma Mumbai Indians : ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆడటం టీమ్‌ఇండియా ఎంపికకు తోడ్పడిందని తిలక్ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. తనకు తాను మద్దతుగా ఉండానని తెలిపాడు. ఐపీఎల్‌లో విండీస్ వీరుడు పోలార్డ్.. ఆఖరి ఓవర్లలో ముంబయికి కీలకంగా ఉండేవాడు. తనను కూడా ఈ విధంగానే ప్రశాంతంగా ఉంటూ, తర్వాతి బంతిపై దృష్టి పెట్టమని పోలార్డ్ సలహా ఇచ్చేవాడని.. తిలక్ గుర్తుచేసుకున్నాడు.