విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 అర్ధశతకాలలో కెప్టెన్ రోహిత్ శర్మను సమం చేశాడు. శుక్రవారం కోల్‌కతాలో విండీస్‌తో జరిగిన రెండో టీ20లో చేసిన అర్ధశతకం(52)తో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు రోహిత్ 30 సార్లు 50కి పైగా స్కోరు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. తాజాగా ప్రదర్శనతో విరాట్ సైతం అతని సరసన నిలిచాడు.
టీ20ల్లో రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ - virat kohli t20 fiftys
కింగ్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 అర్ధశతకాల్లో రోహిత్ రికార్డును సమం చేశాడు. శుక్రవారం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు 96 టీ20ల్లో 51.5 సగటుతో 3296 పరుగులు చేశాడు.
కింగ్ కోహ్లీ 96 అంతర్జాతీయ టీ20ల్లో 51.5 సగటుతో 3296 పరుగులు చేశాడు. ఇందులో 30 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 94. ఐపీఎల్‌లోనూ 6283 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీనే. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ 6వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (14,529), షోయబ్ మాలిక్ (11,611), కీరన్ పొలార్డ్ (11,419), ఆరోన్ ఫించ్ (10,434), డేవిడ్ వార్నర్ (10,308) ఉన్నారు.
ఇదీ చదవండి:మూడో టీ20కు కోహ్లీ దూరం