తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ముగ్గురికి ఝలక్​ ఇవ్వకపోతే.. విండీస్ చేతిలో టీమ్​ఇండియాకు ఓటమి తప్పదు!'

India vs West Indies : జులై 12 నుంచి భారత్​ వర్సెస్​ వెస్టిండీస్​ సమరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కరీబియన్ల జట్టులోని ఆ ముగ్గురు ఆటగాళ్లతో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఈ టోర్నీలో కూడా భారత్ ఓటమి చవిచూడక తప్పదని అంటున్నారు పలువురు మాజీలు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే..

Inida VS West Indies
వీరిన తక్కువ అంచనా వేస్తే మాత్రం.. ఈ టోర్నీ కూడా అంతే..

By

Published : Jul 9, 2023, 10:57 PM IST

Updated : Jul 10, 2023, 3:06 PM IST

West Indies vs India Match : మరో రెండు రోజుల్లో భారత్​,​ వెస్టిండీస్​ మెగా పోరుకు తెరలేవనుంది. ఈ రెండు జట్లు ఈనెల 12 నుంచి రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20లు ఆడనున్నాయి. ఇందులో భాగంగానే ఆ దేశ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు.. తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాక్టీస్​ మ్యాచులను కూడా ఆడుతున్నారు. అయితే ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించి తుది జట్టులను కూడా ప్రకటించాయి ఆయా క్రికెట్​ బోర్డులు.

ఆ ముగ్గురు..!
West Indies vs India Test : జులై 12 నుంచి 17 వరకు జరిగే ఈ టోర్నీలోని రెండు టెస్టుల సిరీస్​ను నెగ్గేందుకు భారత్​కే ఎక్కువ విజయవకాశాలు ఉన్నప్పటికీ.. కరీబియన్ల జట్టులో ఉన్న ఆ ముగ్గురు కీలక ఆటగాళ్లను మాత్రం తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నారు పలువురు మాజీలు. అలా చేసి మెరుగైన ఆటతీరును ప్రదర్శించకపోతే ఈ సిరీస్​ను కూడా చేజేతులా కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ సిరీస్​పై ప్రభావం చూపే ఆ ముగ్గురు విండీస్​ ప్లేయర్స్​ ఎవరంటే.. క్రెయిగ్​ బ్రాత్‌వైట్​​, టాగెనరైన్​ చందర్‌పాల్‌, రకీం కార్న్‌వాల్​.

క్రెయిగ్​ బ్రాత్‌వైట్​!
Kraigg Braithwaite : టెస్టు పార్మాట్​లోని ఇన్నింగ్స్​కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు​. కానీ విండీస్​ కెప్టెన్​ క్రెయిగ్​ బ్రాత్‌వైట్​​ మాత్రం ఇందుకు కాస్త భిన్నం. 1990వ దశకంలో ఆడే ఆటగాళ్లలా చాలా ఓపికగా క్రీజులో ఉంటూ ఇన్నింగ్స్​ను ట్రెడిషనల్​ పద్ధతిలో కొనసాగిస్తుంటాడు. ఎన్ని రోజులైనా బ్యాటింగ్ చేసే సహనం కేవలం బ్రాత్‌వైట్​కే సొంతం అని అంటుంటారు. ఇలా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టడంలో ఇతడు ఆరితేరాడు. అయితే ఈ టెస్టు సిరీస్​లో క్రెయిగ్​ బ్రాత్​వైట్​ను త్వరగా అవుట్ చేయలేకపోతే మాత్రం అనుభవం లేని భారత బౌలింగ్​ను తన కంట్రోల్​లోకి తెచ్చుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

క్రెయిగ్​ బ్రాత్‌వైట్​

టాగెనరైన్​ చందర్‌పాల్​!
Tagenarine Chanderpaul : తండ్రి శివనారాయన్ చందర్‌పాల్​లాగే టాగెనరైన్​ చందర్‌పాల్​ కూడా అద్భుతమైన బ్యాటర్. ఇతడు కూడా బ్రాత్​వైట్​ లాగానే ఓపిక కలిగిన ప్లేయర్​. కాకపోతే బ్రాత్‌వైట్ కన్నా కొంచెం వేగంగా ఆడతాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ఇష్టపడతాడు. బౌలర్లు వేసే మిడిల్​ ఓవర్లో ఇతడ్ని కట్టడి చేయలేకపోతే మాత్రం భారత్​ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కెరీర్​ ఎంట్రీలోనే కంగారూలను కంగారు పెట్టించిన ఈ యువ ప్లేయర్​ ఇటీవలి కాలంలో కెప్టెన్ బ్రాత్‌వైట్‌తో కలిసి విండీస్‌కు అద్భుతమైన ఆరంభాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.

టాగెనరైన్​ చందర్‌పాల్​

రకీం కార్న్‌వాల్​!
Rahkeem Cornwall :బంతిని అద్భుతంగా స్పిన్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్​ను ఇబ్బంది పెట్టడం స్పిన్నర్​ రకీం కార్న్‌వాల్​ స్పెషాల్టీ. అభిమానులు ముద్దుగా ఇతడిని జింబో అని పిలుస్తారు. కార్న్‌వాల్ కాస్త ఎత్తుగా ఉండటం కూడా విండీస్​ జట్టుకు ప్లస్​ పాయింట్​. ఎందుకంటే ఎత్తు ఎక్కువగా ఉంటే మంచి బౌన్స్​ వేయగలడు బౌలర్​. ఇందులో కార్న్​వాల్​ ఆరితేరాడు. కేవలం బాల్​తోనే కాదు బ్యాట్​తోనూ కూడా మాయ చేస్తాడు ఈ జింబో. అయితే ఇటీవల టీమ్​ఇండియా పాల్గొన్న కొన్ని మ్యాచులు గమనిస్తే.. బ్యాటర్లు ఎడం చేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బౌలింగ్​ వేసే సమయంలో బింజోకు ఛాన్స్​ వస్తే మాత్రం మన బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

రకీం కార్న్‌వాల్
Last Updated : Jul 10, 2023, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details