తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ను కట్టడి చేసిన స్పిన్నర్లు.. భారత్​ లక్ష్యం 158 - ind vs wi latest updates

IND vs WI: తొలి టీ20లో టీమ్​ఇండియాకు 158 పరుగుల టార్గెట్ నిర్దేశించింది విండీస్. ఈ మ్యాచ్​తో అరంగేట్రం చేసిన రవి బిష్ణోయ్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెప్పించాడు.

india vs west indies
ఇండియా వెస్టిండీస్ టీ20

By

Published : Feb 16, 2022, 9:01 PM IST

IND vs WI First T20: కోల్​కతాలో జరుగుతున్న తొలి టీ20లో టీమ్​ఇండియా బౌలర్లు ఆకట్టకునే ప్రదర్శన చేశారు. దీంతో వెస్టిండీస్​, నిర్ణీత 20 ఓవర్లలో 157/7 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ అర్ధశతకంతో మెప్పించాడు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ కింగ్​ను భువనేశ్వర్​ ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా భారత స్పిన్నర్ల దెబ్బకు వరుస విరామాల్లో కరీబియన్ బ్యాటర్లు పెవిలియన్​ చేరారు.

విండీస్​ జట్టులో పూరన్ 61, మేయర్స్ 31, పొలార్డ్ 24 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్​ కుమార్ తలో వికెట్ తీశారు.

ఇదీ చదవండి:IND vs WI T20: టాస్​ గెలిచిన భారత్​.. వెస్టిండీస్​ బ్యాటింగ్

ABOUT THE AUTHOR

...view details