తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind Vs WI 3rd ODI : మూడో వన్డేలో ఆ ఇద్దరు.. టీమ్​ఇండియాకు విజయం దక్కేనా ? - ఇండియా వర్సెస్​ వెస్టిండీస్​ మూడో వన్డే వేదిక

Ind Vs WI 3rd ODI : ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో రోహిత్​ సేన మూడో వన్డే తలపడనుంది. ఇప్పటికే తొలి వన్డేలో ‍కష్టపడి విజయం సాధించిన భారత్‌.. రెండో వన్డేలో మాత్రం చతికిలపడి మాత్రం ఘోర పరాజాయం పాలైంది. దీంతో ఈ ఆఖరి మ్యాచ్​పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పిచ్​ ఎలా ఉంది.. వాతావరణంలో ఎలాంటి మార్పులున్నాయన్న విషయాల గురించి ఈ స్పెషల్​ స్టోరీ..

ind vs wi 3rd odi
ind vs wi 3rd odi

By

Published : Aug 1, 2023, 2:39 PM IST

Ind Vs WI 3rd ODI : విండీస్​ పర్యటనలో భాగంగా జరుగుతున్న చివరి వన్డేకు సర్వం సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో తలపడేందుకు రోహిత్​ సేన రెడీగా ఉంది. ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉండటం వల్ల ఈ ఆఖరి మ్యాచ్​పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. హోరా హోరీగా జరగనున్న ఈ మ్యాచ్‌ ఎవరి కైవసం అవుతుందన్న ఆసక్తి క్రికెట్​ లవర్స్​లో మొదలైంది. దీంతో ఇరు జట్టు ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మైదానంలో దిగనున్నాయి. మరోవైపు గత రెండు వన్డేల్లో భారత్ జట్టు తమదైన స్టైల్​లో రాణించినప్పటికీ.. మిశ్రమ ఫలితాలను అందుకోగలిగింది.

తొలి వన్డేలో ‍కష్టపడిన రోహిత్​ సేన.. ఓ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన రెండో వన్డేలో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుంది. బ్యాటింగ్​లో ప్రయోగాలతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి టీమ్​లో లేకపోవడం వల్ల జట్టుకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ క్రమంలో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో ఎటువంటి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించుకున్న మేనేజ్​మెంట్​.. ఈ మ్యాచ్​కు పూర్తి స్దాయి జట్టునే ఆడించాలని అనుకుంటోంది. దీంతో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తుది పోరులో ప్రత్యక్షమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో వన్డేను చేజిక్కించుకున్న కరేబియన్​ జట్టు.. అదే జోరుతో ఆఖరి పోరులోనూ విజయపథంలో నడవాలని ఆశిస్తోంది.

IND Vs WI Pitch Report : ఇక పిచ్​ రిపోర్ట్​ విషయానికి వస్తే.. ట్రినిడాడ్​లోని బ్రియాన్ లారా స్టేడియం పిచ్‌.. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే వికెట్‌ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఈ క్రమంలో బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ మైదానంలో పురుషల క్రికెట్‌ జట్టుతో జరిగే తొలి అంతర్జాతీయ వన్డే ఇదే. కానీ మూడు మహిళల వన్డే మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. కానీ ఒక్క మ్యాచ్‌లోనూ 200 పరుగులు నమోదు కాలేదు.

IND Vs WI Weather Forecast : ఇక సాయంత్రం జరగనున్న మూడో వన్డే సమయానికి వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ చిన్నపాటి వాన పడే అవకాశాలు ఉన్నట్లు ఆక్యూవెధర్‌ సంస్థ తమ రిపోర్ట్‌లో వెల్లడించింది. వర్షం పడటానికి యాబై శాతం ఆస్కారం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. దీంతో ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే.. అప్పుడు రెండు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details