India vs West Indies: విండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. మన స్పిన్ మాయాజాలానికి చిక్కిన కరీబియన్లు.. 176 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభంలోనే చతికిలపడింది. ఓపెనర్లు హోప్ 10 బంతుల్లో 8 పరుగులు, బ్రాండన్ కింగ్ 26 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు కూడా భారత స్పిన్నర్లు సుందర్, చాహల్‌లు ధాటికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో బ్రావో 18(34 బంతుల్లో) , బ్రూక్స్ 12(26), పూరన్‌లు 18(25) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు.
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జేసన్ హోల్డర్(57 పరుగులు).. టెయిలెండర్ అలెన్(29)తో కలిసి గౌరవ ప్రదమైన స్కోరు అందించేందుకు కృషి చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు.
స్పిన్నర్లదే ఆధిపత్యం..
పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటం వల్ల స్పిన్నర్లు చాహల్, సుందర్‌లు విజృంభించారు. చాహల్(49/4), సుందర్(30/3) గణాంకాలు నమోదు చేశారు. పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఓ వికెట్ తీశారు.