తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: ఇషాన్ దంచికొట్టుడు.. శ్రీలంక టార్గెట్ 200 - ఇషాన్ కిషన్ శ్రీలంక టీ20

Ishan kishan: లక్నోలో శ్రీలంకతో తొలి టీ20లో టీమ్​ఇండియా.. 200 పరుగుల భారీ టార్గెట్​ ఫిక్స్ చేసింది. ఇషాన్ కిషన్ 89 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ishan kishan
ఇషాన్ కిషన్

By

Published : Feb 24, 2022, 8:40 PM IST

శ్రీలంకతో తొలి టీ20లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. విండీస్​తో సిరీస్​లో విఫలమైన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. దంచికొట్టాడు. 56 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్​కు 111 పరుగులు జోడించారు. ఆ తర్వాత 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. లహిరు కుమార బౌలింగ్​లో ఔటయ్యాడు.

రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్​ అయ్యర్(28 బంతుల్లో 57 పరుగులు)​తో కలిసి ఇషాన్ కిషన్​.. స్కోరు బోర్డును పరుగులు పెట్టారు. మిగిలిన బ్యాటర్లలో రవీంద్ర జడేజా 3 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో లహిరు కుమార, దసున షనక తలో వికెట్ తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details