INDIA VS SRI LANKA: బెంగళూరు వేదికగా జరుగుతున్న గులాబీ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 28/1 పరుగుల వద్ద నిలిచింది. క్రీజులో మెండిస్ (16*), కరుణరత్నె (10*) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. ఇంకా మూడు రోజుల పాటు మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో మరో 419 పరుగులు చేస్తే లంక విజయం సాధిస్తుంది.
రెండో రోజూ మనదే.. విజయానికి 9 వికెట్ల దూరంలో - INDIA VS SRI LANKA
INDIA VS SRI LANKA: గులాబీ టెస్టు రెండో రోజు ఆటలోనూ టీమ్ఇండియా అదరగొట్టేసింది. మిడిల్ఆర్డర్ బ్యాట్ ఝళిపించిన వేళ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
శ్రేయస్ అయ్యర్
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది టీమ్ఇండియా. రిషభ్ పంత్ (50), శ్రేయస్ అయ్యర్ (67) అర్ధశతకాలతో చెలరేగిన వేళ 9 వికెట్ల నష్టానికి 303 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 447 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.