INDIA VS SRI LANKA 2ND TEST: గులాబీ టెస్టులో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగుతోంది. టీ విరామానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (30), హనుమ విహారి (8*) ఉన్నారు. ప్రస్తుతం 204 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్.
IND vs SL: నిలకడగా భారత్ బ్యాటింగ్.. టీ విరామానికి 61/1 - india srilanka second test
INDIA VS SRI LANKA 2ND TEST: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న గులాబీ టెస్టులో భారత బ్యాటింగ్ నిలకడగా కొనసాగుతోంది. 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్‌సేన.. టీ విరామానికి వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది.
india srilanka second test
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత ఓపెనర్లు నిలకడగానే రాణించారు. అయితే 11వ ఓవర్లలో ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ధనంజయకు చిక్కాడు మయాంక్ అగర్వాల్ (22).
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ కాగా, 143 పరుగుల ఆధిక్యం లభించింది.