INDIA VS SRI LANKA: రెండో రోజు డిన్నర్ బ్రేక్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది టీమ్ఇండియా. క్రీజులో శ్రేయస్ అయ్యర్ (18*), జడేజా (10*) ఉన్నారు. ప్రస్తుతం 342 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది భారత్.
టీ విరామం తర్వాత 61/1 స్కోరుతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. ధాటిగా ఆడటం ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (46) అర్ధశతకం దిశగా సాగాడు. అయితే ధనంజయ బౌలింగ్‌లో 31వ ఓవర్లో అతడు వెనుదిరిగాడు. ఆ వెంటనే విహారి (35) కూడా ఔటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ (18) ఎల్బీడబ్ల్యూగానే పెవిలియన్ చేరాడు. అప్పటికే క్రీజులోకి వచ్చిన పంత్ దంచికొట్టుడుతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది.