INDIA VS SRI LANKA: టీమ్ఇండియాతో జరుగుతున్న గులాబీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనలో ఉన్న శ్రీలంక.. పోరాటం కొనసాగిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. లంక సారథి దిముత్ కరుణరత్నె (67) ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు డిక్వెల్లా (10) క్రీజులో ఉన్నాడు. కుశాల్ మెండిస్ (54) అర్ధశతకంతో మెరవగా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు.
విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.. లంక కెప్టెన్ ఒంటరిపోరు - INDIA VS SRI LANKA 2ND TEST
INDIA VS SRI LANKA: టీమ్ఇండియాతో గులాబీ టెస్టులో మూడు రోజు టీ విరామానికి 151/4 పరుగుల వద్ద నిలిచింది శ్రీలంక. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. విజయానికి మరో 296 పరుగులు చేయాల్సి ఉంది.
INDIA VS SRI LANKA 2ND TEST 2022
రెండో ఇన్నింగ్స్లో టీ విరామం సమయానికి భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా, జడేజా తలో వికెట్ పడగొట్టారు. విజయానికి లంక మరో 296 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ మిగిలిన 6 వికెట్లను పడగొట్టాల్సి ఉంది.