భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు - క్రికెట్ లైవ్
17:40 December 27
వేదిక సెంచూరియన్‌లో ఆగకుండా పడుతున్న వర్షం
IND Vs SA First test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట రద్దు అయింది. మ్యాచ్ జరుగుతున్న సెంచూరియన్ ప్రాంతంలో ఎడతెరిపిలేకుండా వర్షం పడటం వల్ల ఔట్ ఫీల్డ్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
తొలుత వర్షం తగ్గితే కాస్త ఆలస్యంగానైనా మ్యాచ్‌ను ప్రారంభిద్దామనుకున్నా.. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది.
మొదటి టెస్టు తొలి రోజు ఆటలో టీమ్ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (122*) శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60) అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(35) ఫర్వాలేదనిపించాడు. పుజారా (0).. ఎంగిడి బౌలింగ్‌లో డకౌటయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, అజింక్య రహానె (40) క్రీజులో కొనసాగుతున్నారు.