India vs South Africa 2nd T20I : సౌతాఫ్రికా టూర్‌ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది.అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సఫారీలు రెండో టీ20లోటీమ్ఇండియాపై పై చేయి సాధించారు.రింకు సింగ్ మరోసారి చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీఅతడి ప్రయత్నం సరిపోలేదు. మరోవైపు భారత బౌలర్లు విఫలమవ్వడం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది.
రింకు సింగ్ (68), సూర్యకుమార్ యాదవ్ (56), మెరుపులతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే వర్షం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 19.3 ఓవర్ల వద్దే ముగిసింది. ఇక హెండ్రిక్స్ (49), మార్‌క్రమ్ (30), చెలరేగడం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో నిర్ణయించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152 పరుగులను) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక సౌతాఫ్రికా జట్టులోని షంసి (1/18) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. మరోవైపు చివరి మూడో టీ20 గురువారం జరుగనుంది. ఇక తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ టీమ్ఇండియా ఆరంభంలో తడబడింది. తొలి రెండు ఓవర్లలో 38 పరుగులు సాధించిన హెండ్రిక్స్, బ్రీజ్కె (16) సౌతాఫ్రికాకు అదిరే ఆరంభాన్నిచ్చారు. పేలవ బౌలింగ్ వల్ల అర్ష్‌దీప్ రెండో ఓవర్లో ఏకంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్లో బ్రీజ్కెను జడేజా ఔట్ చేసినప్పటికీ భారత్‌కు పెద్దగా ఉపశమనం కలగలేదు. ఇక హెండ్రిక్స్‌తో పాటు మార్‌క్రమ్ కూడా ఎడాపెడా బాల్‌ను బౌండరీలు దాటిస్తూ చెలరేగిపోయాడుయ. ఈ ఇద్దరూ తమ ఇన్నింగ్స్‌లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ముకేశ్, కుల్‌దీప్ లాంటి సూపర్ బౌలర్స్ బ్యాటర్లను నియంత్రించలేకపోయారు.