India vs Pakistan World Cup 2023 : భారత్ పాకిస్థాన్ మధ్య పోరును క్రికెట్ ఆటలోనే హై వోల్టేజ్ మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఈ ఇరు జట్లు రాబోయే ప్రపంచకప్‌లో పోటీ పడనున్న నేపథ్యంలో.. త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారికంగా మ్యాచ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 7 ఆదివారం రోజున భారత్ పాక్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండటం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కావటం వల్ల బోర్డు ఉన్నతాధికారులు నరేంద్రమోదీ స్టేడియాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రానుంది.
India vs Pakistan World Cup 2023 venue : ఈ దాయాదుల మ్యాచ్‌కు నరేంద్ర మోదీ స్టేడియం ఫైనలైజ్ అయితే అభిమానులకు పండగే. లక్ష మంది ప్రేక్షకులు స్వయంగా స్టేడియంలో మ్యాచ్ వీక్షించవచ్చు.
World Cup 2023 India Venues : ఆహ్మదాబాద్తో పాటు హైదరాబాద్, చెన్నై, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, లఖ్‌నవూ, ఇందౌర్, రాజ్‌కోట్, ముంబయి, గువాహటి వేదికల్లో ప్రపంచకప్ నిర్వహించనున్నారు. మొత్తం టోర్నీలో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లకు కేవలం ఏడు మైదానాలే వేదిక కానున్నాయి.
దాయాది పాకిస్థాన్ ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో... బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను కోల్‌కతా, గువాహటి వేదికగానే ఆడనున్నాయి. భద్రత కారణాల దృష్యా పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లను ఈ వేదికలకే పరిమితం చేసినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.