ఓపెనర్లు దూకుడు.. కోహ్లీ హాఫ్ సెంచరీ.. పాక్ లక్ష్యం ఎంతంటే?
21:19 September 04
ఓపెనర్లు దూకుడు.. కోహ్లీ హాఫ్ సెంచరీ.. పాక్ లక్ష్యం ఎంతంటే?
India vs Pakistan Asia Cup : ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. దాయాది ముందు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లీ 44 బంతుల్లో 60 పరుగులతో భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో వికెట్లు కోల్పోవడంతో తొలుత ఊహించినదానికంటే తక్కువకే పరిమితమైంది టీమ్ ఇండియా.
తొలుత టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు రోహిత్, రాహుల్ దూకుడుగా ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ హిట్ మ్యాన్ 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 5.1 ఓవర్లకు 54. రాహుల్ 16 బంతుల్లో 28 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్ విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్(13), పంత్(14), హార్దిక్ పాండ్య(0), దీపక్ హుడా(16) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో రవి బిష్ణోయ్ 2 బంతుల్లో 2 ఫోర్లు కొట్టాడు.
పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. నసీం షా, మహ్మద్, హారిస్ రౌఫ్, మహ్మద్ నవాజ్ తలో వికెట్ పడగొట్టారు.