మహిళల జట్టు ఆల్రౌండ్ షో.. పాకిస్థాన్ చిత్తు.. సెమీస్ ఆశలు సజీవం - INDIA VS PAK WOMEN CWG
18:45 July 31
మహిళల జట్టు ఆల్రౌండ్ షో.. పాకిస్థాన్ చిత్తు.. సెమీస్ ఆశలు సజీవం
IND VS PAK Women: కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు సంబంధించి ఆదివారం జరిగిన కీలక మ్యాచ్లో భారత్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాక్పై 8 వికెట్ల తేడాతో అమ్మాయిలు గెలిచారు. ఈ విజయంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా 11.4 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (63*) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయింది. బ్యాటర్లు షెఫాలీ 16, మేఘన 14 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో తుబా హస్సన్, సోహెల్ తలో వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ సేనను భారత బౌలర్లు చుట్టేశారు. దీంతో 18 ఓవర్లకే ఆలౌటై 99 పరుగులు మాత్రమే చేసింది. టీమ్ఇండియాకు 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ మునీబా (32) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా, మేఘనా సింగ్, షెఫాలీ తలో వికెట్ పడగొట్టారు.