తెలంగాణ

telangana

ETV Bharat / sports

సుందర్​ హాఫ్​ సెంచరీ​.. శ్రేయస్​ సూపర్ ఇన్నింగ్స్​.. కివీస్​కు మోస్తరు లక్ష్యం - టీమ్​ఇండియా న్యూజిలాండ్​ మూడో వన్డే

కివీస్​తో జరుగుతున్న కీలక మ్యాచ్​లో భారత్​ బ్యాటర్లు తడబడ్డారు. న్యూజిలాండ్​ బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చలాయించారు. దీంతో భారత్‌ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది.

india vs newzealand third oneday match
india vs newzealand third oneday match

By

Published : Nov 30, 2022, 10:55 AM IST

Updated : Nov 30, 2022, 11:03 AM IST

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్రేయస్‌ అయ్యర్‌(49), చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌(51) తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లు పూర్తిగా ఆధిపత్యం చలాయించారు. దీంతో భారత్‌ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ధావన్‌(28), గిల్‌(13), పంత్‌(10), సూర్య(6), హుడా(12), చాహర్‌(12) పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో మిచెల్‌, మిల్నే చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. సౌథీకి రెండు, ఫెర్గుసన్‌, శాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

Last Updated : Nov 30, 2022, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details