త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC final) విజేతను తేల్చేందుకు మూడు మ్యాచ్‌లు ఉండాలని దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు. ఇది ఈరోజుల్లో ఏమంత పెద్ద విషయం కాదని చెప్పారు. అయితే టెస్టు మ్యాచ్‌ల పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించేందుకు తెచ్చిన ఈ విధానంపై ఐసీసీని మెచ్చుకోవాల్సిందేనని అన్నారు.
బౌలర్ల కంటే బ్యాట్స్‌మెన్ గొప్ప అని తాను అనుకోవట్లేదని కపిల్‌దేవ్ చెప్పారు. ప్రస్తుతం టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్నప్పటికీ, పిచ్ పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతారనేది ముఖ్యమని అన్నారు.