కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు ఓ ఎమోషన్. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన ఈ మైదానంతో(Eden gardens match) ఫ్యాన్స్‌కు విడదీయరాని అనుబంధం ఉంటుంది. కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా బోసిపోయిన ఈ గ్రౌండ్లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ సందడి మొదలవనుంది. ప్రేక్షకులు స్టేడియంలో కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్‌తో మూడో టీ20(Third t20 ind vs nz)... ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం(నవంబరు 21) జరగనుంది.
ఈడెన్ గార్డెన్స్‌లో చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్, భారత్ తొలి పింక్ బాల్/డే-నైట్ టెస్టు జరిగింది. అప్పటి నుంచి ఈ మైదానంలో మరో మ్యాచ్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే.. బంగాల్ ప్రభుత్వం కూడా ఈ స్టేడియంలో 70 శాతం సీటింగ్ సామర్థ్యానికి అనుమతినిచ్చింది.
కానీ, వారు మాత్రం..
అయితే.. టికెట్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించడంపై.. కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు.. కౌంటర్ల వద్ద టికెట్ల దొరకకపోడవం(Eden gardens ticket booking) వల్ల నిరాశకు లోనవుతున్నారు.