న్యూజిలాండ్‌తో (Ind vs NZ) జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma News).. కెప్టెన్సీ పరంగా ఒక అరుదైన తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు (Aakash Chopra News). బుధవారం(నవంబరు 17) రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ఆకాశ్ తన యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"టీమ్‌ఇండియా ఇంతకుముందు ఆరో బౌలర్ కావాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌ను ఆడించారు. కానీ, అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇది రోహిత్‌శర్మ కెప్టెన్సీలో చాలా అరుదైన తప్పిదమని నేను భావిస్తా. సహజంగా అతడి నాయకత్వం బాగుంటుంది. కానీ, వెంకటేశ్‌కు బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు"
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత
"రోహిత్ (Aakash Chopra Rohit Sharma) టాస్ గెలిచాక అతడిని బౌలింగ్‌కు తీసుకురావాల్సింది. ఆదిలోనే కివీస్ ఒక వికెట్ కోల్పోయి తడబడుతున్న వేళ వెంకటేశ్ చేత రెండు, మూడు ఓవర్లు వేయించాల్సింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ ఎక్కువ పరుగులిచ్చిన నేపథ్యంలో అతడిని కూడా ఉపయోగించుకోవాల్సింది. మరోవైపు సీనియర్ బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా భువి బౌలింగ్‌లో రాణించడం విశేషం. వాళ్లిద్దరూ తమ అనుభవంతో పొదుపుగా బౌలింగ్ చేశారు" అని ఆకాశ్ తన అభిప్రాయాలు తెలిపాడు.