న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 కోసం భారత్ సంసిద్ధమయ్యింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ఉండటంతో ఈ గేమ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్ ఇండియా రెండో టీ20లో జోరందుకుని మ్యాచ్ కైవసంచే సుకుంది. దీంతో ఈ మ్యాచ్ గెలుపు రెండు టీమ్‌లకు కీలకం కానుంది.
అహ్మదాబాద్‌లో కివీస్‌తో భారత్ పోరుకు వాతావరణం అనుకూలిస్తుందా ? - న్యూజిలాండ్ vs ఇండియా మూడో టీ20 వేదిక
న్యూజిలాండ్-భారత్ మధ్య మూడో టీ20 బుధవారం జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అహ్మదబాద్కు చేరుకున్న ఇరు జట్లు మైదానంలో పోరుకు సిద్ధమయ్యాయి. అయితే అక్కడి వాతావరణం మ్యాచ్‌కు అనుకూలిస్తుందా లేదా అన్న అనుమానం అభిమానుల్లో తలెత్తింది.
అయితే ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న అనుమానం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా బుధవారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలిలో ఉండాల్సిన తేమ శాతం కూడా 35 నుంచి 45 శాతంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వాన పడే అవకాశాలు చాలా తక్కువ. మరో వైపు మ్యచ్ వేదికైన నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు మ్యాచ్‌లు జరగ్గా అందులో టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. కివీస్ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. దీంతో ఇక గెలుపు టీమ్ ఇండియాదే అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.