India vs New Zealand 2ndTest : న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఇన్నింగ్స్‌లో స్పైడర్ క్యామ్ కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ముంబయి వాంఖడే స్టేడియంలో టీ బ్రేక్ సమయానికి కొన్ని ఓవర్లు మిగిలుండగానే ఈ సంఘటన జరిగింది. పిచ్‌కు కొంచెం ఎత్తులోనే క్యామ్ ఆగిపోవడం వల్ల ముందుగానే టీ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
అయితే.. స్పైడర్ క్యామ్ ఆగిపోయిన సమయంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ అందులో రికార్డు అయింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా స్పైడర్ కెమెరాతో కామెడీ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ.. కెమెరా దగ్గరకు వచ్చి పైకి వెళ్లమని చెప్పడం. సూర్యకుమార్ యాదవ్ క్లోజప్ నవ్వులు పూయిస్తోంది.